దెయ్యం పాత్రలో పూజా హెగ్డే!
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:48 AM
హీరోయిన్ పూజా హెగ్డే దెయ్యం పాత్రలో కనిపించనున్నారు. దర్శకనటుడు రాఘవ లారెన్స్ రూపొందించనున్న ‘కాంచన’ సీక్వెల్ నాలుగో భాగంలో ఆమె దెయ్యంగా...
హీరోయిన్ పూజా హెగ్డే దెయ్యం పాత్రలో కనిపించనున్నారు. దర్శకనటుడు రాఘవ లారెన్స్ రూపొందించనున్న ‘కాంచన’ సీక్వెల్ నాలుగో భాగంలో ఆమె దెయ్యంగా నటించనున్నట్టు సమాచారం. ఇందులోనే హీరోయిన్‌గా పూజాను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు వచ్చిన తొలి మూడు భాగాలు సూపర్‌హిట్ అయిన విషయం తెల్సిందే. దీంతో నాలుగో భాగాన్ని రూపొందించే పనిలో రాఘవ లారెన్స్ నిమగ్నమయ్యారు. ఇందుకోసం టెక్నీషియన్స్, నటీనటుల ఎంపిక జరుగుతోంది.