మాఫియాతో పోలీస్ పోరాటం
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:33 AM
సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించే పోలీసాఫీసర్ కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘విద్రోహి’. రవిప్రకాశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీఎ్‌సవీ దర్శకత్వంలో వీ వెంకట సుబ్రహ్మణ్యం, పీ కనకదుర్గారావు ...
సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించే పోలీసాఫీసర్ కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘విద్రోహి’. రవిప్రకాశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీఎ్‌సవీ దర్శకత్వంలో వీ వెంకట సుబ్రహ్మణ్యం, పీ కనకదుర్గారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా యూనిట్ విడుదల చేసింది. రవి ప్రకాశ్ మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. కథలో ఊహించని మలుపులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. దర్శకుడిగా వీఎ్‌సవీకి పేరు తెస్తుంది’ అన్నారు. ఒక తెలివైన పోలీసు మాఫియాను మట్టుబెట్టిన తీరు ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు చెప్పారు. సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సతీశ్ ముత్యాల.
Read More Business News and Latest Telugu News