Police complaint: పోలీస్ కంప్లైంట్’.. బలమైన పాత్రలో వరలక్ష్మి
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:04 PM
వరలక్ష్మి శరత్‌కుమార్ (Vara Lakshmi Sarathkumar) పవర్‌ఫుల్ రోల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police complain) నవీన్ చంద్ర కథనాయకుడు. టీజర్ ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేసారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ (Vara Lakshmi Sarathkumar) పవర్‌ఫుల్ రోల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police complain) నవీన్ చంద్ర కథనాయకుడు. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇటీవల తెలుగు, కన్నడ టీజర్ ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేసారు.
డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ
'ప్రేమ, పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందించాం. కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ సినిమాలో భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. 45 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి వరలక్ష్మియే కారణం. తెలుగు, తమిళం, మలయాళం కన్నడం.. నాలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నాం' అన్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ 'డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశాను. ఇందులో బలమైన పాత్రలో కనిపిస్తా. యాక్షన్ తో పాటు ఫుల్లుగా కామెడీ చేశాను. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది' అని అన్నారు.