Varalakshmi Sharathkumar: ఊహకందని మలుపులతో
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:22 AM
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లెయింట్’ కర్మసిద్ధాంతంపై ఆధారపడి, ఊహకందని మలుపులతో కథ సాగుతుంది. సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
Police Complaint Movie: వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నవీన్‌చంద్ర, రవిశంకర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కర్మసిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హారర్ థ్రిల్లర్ జానర్‌లో ఊహకందని మలుపులతో కథ సాగుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది’ అని చెప్పారు. ఈ చిత్రంలో కృష్ణగారి మీద ప్రత్యేకంగా ఓ గీతాన్ని రూపొందించాం, అది సినిమాకు ప్రత్యేకాకర్షణ అని నిర్మాతలు చెప్పారు. సంగీతం: సుదీంధ్ర, సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్ హరీశ్