Pickles Girl Ramya: హీరోయిన్‌గా పచ్చళ్ల పాప
ABN , Publish Date - May 17 , 2025 | 12:59 AM
పికెల్స్ సిస్టర్స్ ఫేమ్ రమ్య ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెట్టారు. వచ్చినవాడు గౌతమ్ చిత్ర టీజర్ ఈవెంట్‌లో ఆమె కనిపించడంతో, ఆమె సినిమాలో పాత్రపై ఆసక్తి నెలకొంది.
పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ ఒక్కసారిగా జనం నోళ్లలో నానారు. నెగెటివ్ ప్రచారం వ్యాపారాన్ని దెబ్బతీసినా వారికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగింది. ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య తాజాగా సినిమాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘వచ్చినవాడు గౌతమ్’ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో ఆమె వేదికపై కనిపించారు. ఈ సినిమాలో రమ్య నటించారని తెలుస్తోంది. అయితే ఆమె కథానాయికగా నటించారా లేదా కీలకపాత్రలో కనిపించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.