Pellikani prasad : సప్తగిరి వినోదాల విందు
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:33 AM
అల్లరి నరేశ్ హీరోగా 17 ఏళ్ల క్రితం ‘పెళ్లి కాని ప్రసాద్’ పేరుతో ఓ సినిమా వచ్చి, ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో..
అల్లరి నరేశ్ హీరోగా 17 ఏళ్ల క్రితం ‘పెళ్లి కాని ప్రసాద్’ పేరుతో ఓ సినిమా వచ్చి, ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో హాస్య నటుడు సప్తగిరి హీరో కావడం విశేషం. ప్రియాంక శర్మ హీరోయిన్. వినోదభరితంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకుడు. టైటిల్, ఫస్ట్ లుక్ సహా కొన్ని ఆసక్తికరమైన అంశాలను సోమవారం విడుదల చేశారు. సినిమాను మార్చి 21న దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్, వెంకటేశ్వర గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల ఈ సినిమాను నిర్మించారు.
ఇవి కూడా చదవండి..