ఈ సారి ముగిద్దాం

ABN, Publish Date - May 13 , 2025 | 02:59 AM

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సుజిత్‌ తెరకెకిక్కిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘ఓజీ’. పవన్‌ రాజకీయాల్లో అడుగుపెట్టాక ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది...

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సుజిత్‌ తెరకెకిక్కిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘ఓజీ’. పవన్‌ రాజకీయాల్లో అడుగుపెట్టాక ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చిత్రీకరణ రీస్టార్ట్‌ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. వారి ఎదురుచూపులు ఫలించాయని తెలిపింది ఓజీ టీమ్‌. ఈ సినిమా షూట్‌ ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. ‘‘మళ్లీ మొదలైంది. ఈ సారి ముగిద్దాం’’ అని పేర్కొంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ కథానాయిక.

Updated Date - May 13 , 2025 | 02:59 AM