ముగింపు దశలో చిత్రీకరణ

ABN, Publish Date - May 05 , 2025 | 05:15 AM

పవన్‌ కల్యాణ్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త చెప్పారు ‘హరి హర వీరమల్లు’ మేకర్స్‌. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్‌లో వవన్‌ పాల్గొన్నట్లు...

పవన్‌ కల్యాణ్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త చెప్పారు ‘హరి హర వీరమల్లు’ మేకర్స్‌. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్‌లో వవన్‌ పాల్గొన్నట్లు చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. పవన్‌ ప్రస్తుతం రెండు రోజుల షూటింగ్‌లో పాల్గొంటారని, దీనితో సినిమా గ్రాండ్‌గా ఒక ముగింపు దశకు వచ్చేసినట్లేనని పేర్కొంది. అతి త్వరలోనే ‘హరిహర వీరమల్లు’ సాలిడ్‌ ట్రైలర్‌ సహా పాటలు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. త్వరలోనే అధికారిక రిలీజ్‌ డేట్‌ కూడా రానున్నట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మిస్తుండగాఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - May 05 , 2025 | 05:15 AM