కీరవాణికి పవన్‌కల్యాణ్‌ అభినందన

ABN, Publish Date - May 21 , 2025 | 01:40 AM

‘సలసల మరిగే నీలోని రక్తమే..’ అనే పాటకు సంగీత సాహిత్యాలతో కీరవాణి ప్రాణం పోశారని ఏపీ ఉపముఖ్యమంత్రి వపన్‌కల్యాణ్‌ అభినందించారు. మంగళవారం ఉదయం...

‘సలసల మరిగే నీలోని రక్తమే..’ అనే పాటకు సంగీత సాహిత్యాలతో కీరవాణి ప్రాణం పోశారని ఏపీ ఉపముఖ్యమంత్రి వపన్‌కల్యాణ్‌ అభినందించారు. మంగళవారం ఉదయం తనని కీరవాణి కలసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తను హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను శిఖరస్థాయికి తీసుకెళ్లాయని ఆయన చెప్పారు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగ్గట్లు ఉండాలి కదా’ అని కీరవాణి చెప్పడం ఆయన అంకితభావాన్ని తెలియజేస్తుంది’ అన్నారు పవన్‌కల్యాణ్‌.

Updated Date - May 21 , 2025 | 01:40 AM