పవన్ మూర్తీభవించిన ధర్మాగ్రహం
ABN , Publish Date - May 22 , 2025 | 06:13 AM
‘‘ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌గారిని మీరంతా పవర్‌స్టార్ అని పిలుస్తారు. ఆయన మూర్తీభవించిన ధర్మాగ్రహం అని నేను అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం...
‘‘ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌గారిని మీరంతా పవర్‌స్టార్ అని పిలుస్తారు. ఆయన మూర్తీభవించిన ధర్మాగ్రహం అని నేను అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా ‘హరిహర వీరమల్లు’ను తీర్చిదిద్దారు’’ అని సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి అన్నారు. పవన్‌కల్యాణ్, నిధి అగర్వాల్ జంటగా జ్యోతికృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏ.ఎం.రత్నం నిర్మించారు. జూన్ 12న చిత్రం విడుదలవుతోంది. బుధవారం ఈ చిత్రం నుంచి మూడో గీతం ‘అసుర హననం’ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘జయాపజాయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో పనిచేశాను’’ అని చెప్పారు. చిత్రదర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌గారిని డైరెక్ట్ చేయడమనేది ప్రతీ ఒక్క దర్శకుడి కల. అది ఓ పెద్ద అవార్డుతో సమానం. కత్తికీ, ధర్మానికీ మధ్య జరిగే యుద్ధమే ఈ కథ’’ అని తెలిపారు. చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. తెలుగులో పాటూ విడుదలయ్యే అన్ని భాషల్లో భారీ విజయం సాధిస్తుంది’’ అని అన్నారు.