Jyothikrishna Director: వీరమల్లు రాక ఖరారు
ABN, Publish Date - May 17 , 2025 | 01:22 AM
పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల తేదీ జూన్ 12గా ఖరారు చేయబడింది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
సినీ అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ ఖారారైంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. త్వరలో మూడో గీతంతోపాటు ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.