Hari Hara Veera Mallu: పవర్‌ తుపానుకు సిద్ధంగా ఉండండి

ABN , Publish Date - May 30 , 2025 | 05:47 AM

తను నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి పవన్‌కల్యాణ్‌ డబ్బింగ్‌ చెప్పడంతో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏపీ ఉపముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ...

తను నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి పవన్‌కల్యాణ్‌ డబ్బింగ్‌ చెప్పడంతో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏపీ ఉపముఖ్యమంత్రిగా బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ తీరిక చేసుకుని రాత్రి పది గంటలకు డబ్బింగ్‌ మొదలు పెట్టి ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారు పవన్‌కల్యాణ్‌. ఈ విషయం వెల్లడిస్తూ ‘పవర్‌ తుపానుకు సిద్ధంగా ఉండండి. జూన్‌ 12న మీ ఉత్తేజం ఉరకలేస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. ఏ.ఎం.రత్నం సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు.

Updated Date - May 30 , 2025 | 06:02 AM