జానూతో ప్రేమ గీతం
ABN , Publish Date - May 05 , 2025 | 05:02 AM
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ కథానాయిక. గోవిందరాజు సమర్పణలో...
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ కథానాయిక. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎం.ఎ్‌స.ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రబృందం ఆదివారం ‘జానూ మేరీ జానూ’ అంటూ సాగే ప్రేమగీతాన్ని విడుదల చేసింది. శ్రీహర్ష ఈమని సాహిత్యానికి శేఖర్‌చంద్ర స్వరాలు సమకూర్చగా, వినాయక్ ఆలపించారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివా ్‌సరెడ్డి, రవి వర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది, ఎడిటర్: ప్రవీణ్ పూడి.