ఆపరేషన్‌ సిందూర్‌ టైటిల్‌

ABN , Publish Date - May 11 , 2025 | 03:42 AM

పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్‌ మట్టుబెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్‌తో సినిమాను...

  • దర్శకుడి క్షమాపణలు

పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్‌ మట్టుబెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్‌తో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించి దర్శకుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. డైరెక్టర్‌ ఉత్తమ్‌ మహేశ్వరీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భగ్నాని ఫిల్మ్స్‌ బ్యానర్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానంటూ ఓ పోస్టర్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్‌కు ఇదా సమయం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యుద్ధం కొనసాగుతోంది..సిగ్గుండాలి’ అంటూ ఘాటు కామెంట్స్‌ పెట్టారు. దీంతో దర్శకుడు క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు.

Updated Date - May 11 , 2025 | 03:42 AM