ఓజీ విడుదల తేదీ వచ్చేసింది
ABN , Publish Date - May 26 , 2025 | 04:43 AM
పవన్‌కల్యాణ్ కధానాయకుడిగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ కథానాయిక....
పవన్‌కల్యాణ్ కధానాయకుడిగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ కథానాయిక. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడు. ఇందులో ఓజాస్ గంభీరా అనే శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. రాజీకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఇటీవలె ఈ సినిమా షూట్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు మేకర్స్. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.