దుష్టశక్తిపై సమరం
ABN, Publish Date - Apr 09 , 2025 | 04:39 AM
గ్లామర్ తార తమన్నా భాటియా నాగ సాధువుగా నటించిన ‘ఓదెల 2’ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు ఇది...
గ్లామర్ తార తమన్నా భాటియా నాగ సాధువుగా నటించిన ‘ఓదెల 2’ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు ఇది సీక్వెల్. దర్శకుడు సంపత్‌నంది కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు అందించడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అశోక్ తేజ దర్శకుడు. డి. మధు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఓదెల గ్రామానికి ఓ దుష్ట శక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉందని చెప్పే ఓ వపర్‌ఫుల్ వాయి్‌సతో ట్రైలర్ మొదలవుతుంది. మంచికీ, చెడుకీ మధ్య జరిగే సమరంలో ఓ నాగసాధువు ఆ గ్రామాన్ని ఎలా రక్షించిందన్న కథాంశంతో ఆసక్తికరంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. తమన్నా తన అద్భుత నటనతో నాగసాధువు పాత్రకు సహజత్వం తెచ్చారు. అలాగే వశిష్ట ఎన్ సింహ పోషించిన మాంత్రికుడి పాత్ర భయానకంగా ఉంది.