New Role: సరికొత్తగా ఎన్టీఆర్‌ పాత్ర

ABN , Publish Date - Feb 22 , 2025 | 06:03 AM

ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్‌ను రచయిత అబ్బాస్‌ మీడియాతో పంచుకున్నారు.

Chitra Jyothy: ఎన్టీఆర్‌ హీరోగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్‌ 2’. హృతిక్‌రోషన్‌ మరో కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్‌ను రచయిత అబ్బాస్‌ మీడియాతో పంచుకున్నారు. ‘వార్‌ 2’ చిత్రీకరణ దాదాపు పూర్తికావొచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో యాక్షన్‌ ఘట్టాలు ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయన్నారు. ఎన్టీఆర్‌ పాత్రను ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తీర్చిదిద్దాడనీ, ప్రేక్షకుల అంచనాలకు అందదని తెలిపారు. హృతిక్‌రోషన్‌, టైగర్‌ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కిన ‘వార్‌’ చిత్రానికి ఇది కొనసాగింపు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బేనర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. అబ్బాస్‌ మాత్రం ఆగస్టు 25న ‘వార్‌ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని చెప్పడం గమనార్హం.

Updated Date - Feb 22 , 2025 | 06:04 AM