పుట్టినరోజు ప్రత్యేకం
ABN, Publish Date - May 21 , 2025 | 01:44 AM
ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు...
ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. వైఆర్‌ఎఫ్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలవుతోంది. మంగళవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు మేకర్స్. ఆకట్టుకునే సంభాషణలు, అద్భుతమైన విజువల్స్‌తో 95 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్ యాక్షన్ ప్రియులను అలరించేలా ఉంది. ముఖ్యంగా, ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాయి. కియారా అడ్వానీ కథానాయిక.