దర్శకత్వ ఆలోచన లేదు
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:22 AM
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నటుడు ఎస్.జె.సూర్య మీడియాతో ముచ్చటించారు.‘...
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నటుడు ఎస్.జె.సూర్య మీడియాతో ముచ్చటించారు.‘ డైరెక్టర్ శంకర్‌తో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రామ్‌చరణ్ అద్భుతమైన నటుడు. ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ‘గేమ్ ఛేంజర్’లో అన్ని అంశాలు ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. నాకు నటుడిగా చాలా కంఫర్ట్‌గా ఉంది. దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు’ అని అన్నారు.