‘తమ్ముడు’ రాక ఖాయం
ABN , Publish Date - May 05 , 2025 | 05:10 AM
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తమ్ముడు’. ఆదివారం శ్రీరామ్ వేణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది...
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తమ్ముడు’. ఆదివారం శ్రీరామ్ వేణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జూలై 4న ‘తమ్ముడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ చిత్రంతో అందించబోతున్నట్లు దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలు. లయ కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్.