Robinhood : నీ వెంటే నేనుంటా
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:23 AM
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈనెల 28న విడుదలవుతోంది. ప్రేమికుల
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈనెల 28న విడుదలవుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రంలోని రెండో పాట ‘వేర్ ఎవర్ యు గో...’ని మహేశ్ బాబు రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ సాహిత్యానికి జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించారు.
మ్యాజిక్‌తో
ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మ్యాజిక్’. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సారా అర్జున్, అన్మోల్ కజానీ, ఆకాశ్ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత ప్రాథాన్యమున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. శుక్రవారం చిత్రబృందం ‘డోంట్ నో వై’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. ఐశ్వర్య సురేశ్‌తో కలసి అనిరుధ్ ఆలపించారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్, ఎడిటర్: నవీన్ నూలీ
ప్రేమికుల పోరాటం
కథానాయకుడు నాని సమర్పకుడిగా రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మాత. ‘ప్రేమలో...’ అంటూ సాగే పాటను యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. పూర్ణాచారి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచారు. ఈ చిత్రం మార్చి 14న విడుదలవనుంది.