ప్రేమకథలో పలు మలుపులు
ABN , Publish Date - May 23 , 2025 | 03:52 AM
పలు సూపర్‌హిట్ సినిమాలు, వెబ్ సిరీ్‌సతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో శ్రీరామ్ తాజా చిత్రం ‘నిశ్శబ్ద ప్రేమ’. ప్రియాంక తిమ్మేష్ కథానాయిక....
పలు సూపర్‌హిట్ సినిమాలు, వెబ్ సిరీ్‌సతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో శ్రీరామ్ తాజా చిత్రం ‘నిశ్శబ్ద ప్రేమ’. ప్రియాంక తిమ్మేష్ కథానాయిక. రాజ్ దేవ్ దర్శకత్వంలో లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కార్తికేయన్ ఎస్ నిర్మించారు. శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘లవ్‌స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిగిన గ్రిప్పింగ్ మూవీ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమిళంలో ఇప్పటికే హిట్ అయింది. మంచి సినిమాకు భాషా భేదాలు లేవు కనుక ఇక్కడ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.