అమ్మాయి కోసం..
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:10 AM
సౌమిత్‌రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం ‘నిలవే’. సౌమిత్‌రావు, సాయి వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి నిర్మాతలు. సోమవారం ఈ సినిమా...
సౌమిత్‌రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం ‘నిలవే’. సౌమిత్‌రావు, సాయి వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి నిర్మాతలు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అర్జున్ అనే వ్యక్తి తన ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయపడుతుంటాడు. అతని జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించి కొత్త కాంతిని తీసుకొస్తుంది. టీజర్‌లో ఆ అమ్మాయి కోసం ఎంతదూరమైనా వెళ్తారు అనే అంశాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి దిలీప్ కె.కుమార్ సినిమాటోగ్రఫీ, కళ్లాన్ నాయక్ సంగీతం అందిస్తున్నారు.