న్యూ ఇయర్‌.. న్యూ లుక్స్‌!

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:32 AM

కొత్త సంవత్సరం ఆరంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఆశలు, అంచనాలు కూడా మొదలయ్యాయు. ఇక సంవత్సరం తొలి రోజున కొత్త పోస్టర్లు, కొత్త లుక్స్‌ సందడి చేశాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ చిత్రం...

కొత్త సంవత్సరం ఆరంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఆశలు, అంచనాలు కూడా మొదలయ్యాయు. ఇక సంవత్సరం తొలి రోజున కొత్త పోస్టర్లు, కొత్త లుక్స్‌ సందడి చేశాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం ‘మాట వినాలి’ అంటూ ఓ పాట పాడారు. ఈ పాటను ఈ నెల 6న విడుదల చేస్తామంటూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసింది. అలాగే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌, కియారా ఉన్న కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ కలసి నటిస్తున్న చిత్రంలోని హీరో హీరోయిన్ల ఫస్ట్‌ లుక్‌ను మైత్రీ మూవీస్‌ రిలీజ్‌ చేసింది. అలాగే నితిన్‌ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్‌’, నాని నటిస్తున్న ‘హిట్‌ 3’, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్‌’ సినిమాల కొత్త స్టిల్స్‌ విడుదలయ్యాయి.

Updated Date - Jan 02 , 2025 | 06:32 AM