రామ్‌చరణ్‌పై డాక్యుమెంటరీ

ABN , Publish Date - May 14 , 2025 | 05:47 AM

‘చిరుత’తో తొలి అడుగులు వేసిన రామ్‌చరణ్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారు. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా.. స్వయం కృషితో అంచెలంచెలుగా...

‘చిరుత’తో తొలి అడుగులు వేసిన రామ్‌చరణ్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారు. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా.. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఇటీవలె లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రామ్‌చరణ్‌పై ఓ డాక్యుమెంటరీని రూపొందించే పనిలో ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్‌ ప్రస్థానాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఈ డాక్యుమెంటరీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు రామ్‌చరణ్‌పై తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. చిరంజీవితోపాటు సుకుమార్‌, రాజమౌళి, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితరులు ఈ డాక్యుమెంటరీలో కనిపించే అవకాశం ఉందని, ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెరవెనుక విశేషాలను కూడా డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు సమాచారం.

Updated Date - May 14 , 2025 | 05:47 AM