సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం

ABN , Publish Date - May 18 , 2025 | 01:23 AM

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించే చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. పూర్తి స్థాయి వినోదభరితంగా రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో చాలా కాలం...

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించే చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. పూర్తి స్థాయి వినోదభరితంగా రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్‌ హ్యుమరెస్‌ రోల్‌ చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార కధానాయికగా నటించనున్నట్లు వెల్లడిస్తూ ఓ వీడియా విడుదల చేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ వీడియాలో నయనతార తన టీమ్‌తో తెలుగులో మాట్లాడడం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్‌ పాటలు వినడం, చివరికి దర్శకుడు అనిల్‌ రావిపూడితో కలసి ‘సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం’ అని చెప్పడం ఆకట్టుకుంది. అనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచి సాంకేతిక బృందాన్ని పరిచయం చేయడం, నయనతారను లీడ్‌ యాకె్ట్ర్‌సగా ప్రకటించడం.. వరకూ జరిగిన ప్రతి ప్రమోషన్‌ వినూత్నంగా, ఆకట్టుకొనేలా సాగింది. 2026 సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి నిర్ణయించుకొన్నట్లు శనివారం విడుదల చేసిన వీడియోలో మరోసారి స్పష్టం చేశారు అనిల్‌ రావిపూడి.

Updated Date - May 18 , 2025 | 01:23 AM