కథ నుంచి వచ్చిన టైటిల్
ABN , Publish Date - May 15 , 2025 | 02:51 AM
‘‘లెవన్’ కథ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా. ఇందులో పోలీసులు హంతకుణ్ణి పట్టుకునేందుకు సాగించే అన్వేషణ నవ్య పంథాలో ఉంటుంది. ప్రేక్షకులు ఆశించే అంశాలతో సినిమా ఆద్యంతం...
‘‘లెవన్’ కథ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా. ఇందులో పోలీసులు హంతకుణ్ణి పట్టుకునేందుకు సాగించే అన్వేషణ నవ్య పంథాలో ఉంటుంది. ప్రేక్షకులు ఆశించే అంశాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’ అని నవీన్‌చంద్ర అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘లెవన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో అజ్మల్‌ఖాన్, రేయా హరి నిర్మించారు. ఈ నెల 16న విడుదలవుతున్న సందర్భంగా నవీన్‌చంద్ర సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఒక సైకో కిల్లర్ చేసే హత్యల నేపథ్యంలో అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ‘లెవన్’ అనేది కథ నుంచి వచ్చిన టైటిల్. దానికి కథలో ఉన్న ప్రాముఖ్యం ఏమిటో సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కథలో మలుపులు, ప్రేక్షకులను ఎగ్జైట్ చేశాయి. ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్‌లోనూ రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. విజువల్స్ పరంగా ఓ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌లోనూ నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. నటుడిగా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవ్వాలనేది నా ప్రయత్నం. అందుకే విభిన్న పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ‘హనీ’, ‘కాళీ’ చిత్రాలతో పాటు రవితేజ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్నాను.