కొత్తదనంతో నిండిన చిత్రం
ABN , Publish Date - May 19 , 2025 | 03:30 AM
నవీన్ చంద్ర హీరోగా రాకేశ్ పొట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరాలి’. మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లు. ఆదివారం ఈ సినిమాను...
నవీన్ చంద్ర హీరోగా రాకేశ్ పొట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరాలి’. మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లు. ఆదివారం ఈ సినిమాను ప్రారంభించారు. నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టి స్ర్కిప్టును అందజేశారు. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘‘నేనింతవరకూ ఇటువంటి యాక్షన్ డ్రామా చేయలేదు. కొత్తదనంతో నిండిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు.