Nara Rohit: అక్టోబర్‌లో పెళ్లివేడుక
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:30 AM
నారా రోహిత్ అక్టోబర్‌లో శిరీషతో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. తండ్రి మరణం కారణంగా పెళ్లి వేడుక వాయిదా పడింది.
అక్టోబర్‌లో సిరి లేళ్ల (శిరీష)తో ఏడడుగులు వేయబోతున్నట్లు నారా రోహిత్ తెలిపారు. ఆయన నటించిన ‘భైరవం’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ తమ పెళ్లి గురించి స్పందించారు. ‘ప్రతినిధి 2’ చిత్రంలో జంటగా నటించిన నారా రోహిత్, శిరీష ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. గతేడాది అక్టోబర్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వారి నిశ్చితార్థం జరిగింది. అయితే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు నవంబర్‌లో కన్నుమూయడంతో పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నారు.