Hero Nani: నన్ను అరెస్ట్‌ చేసుకోండి

ABN , Publish Date - Feb 22 , 2025 | 06:11 AM

కానీ మా సినిమాను మాత్రం బ్లాక్‌బస్టర్‌ చేయండి’ అంటూ చమత్కరించారు హీరో నాని. తన వాల్‌ పోస్టర్‌ సినిమా బేనర్‌పై ఆయన సమర్పించిన చిత్రం ‘కోర్ట్‌ -స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’.

"వీళ్లందరితో ‘కోర్ట్‌’ అనే సినిమా తీసి నేరం చేసింది నేనే. కావాలంటే నన్ను అరెస్ట్‌ చేసుకోండి. కానీ మా సినిమాను మాత్రం బ్లాక్‌బస్టర్‌ చేయండి’ అంటూ చమత్కరించారు హీరో నాని. తన వాల్‌ పోస్టర్‌ సినిమా బేనర్‌పై ఆయన సమర్పించిన చిత్రం ‘కోర్ట్‌ -స్టేట్‌ వర్సెస్‌ ఎ నో బడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా, రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాత. మార్చి 14న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా యూనిట్‌ మీడియాతో ముచ్చటించింది. నాని మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. దర్శి, రోషన్‌, శ్రీదేవి అద్భుతంగా నటించారు. కథ కోసం దర్శకుడు చాలా పరిశోధన చేశారు. ఇందులో కథే హీరో. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు నిలబడి క్లాప్స్‌ కొడతారు. ఇది నా గ్యారెంటీ. మీరంతా ఓ మంచి చిత్రం చూడబోతున్నారు. ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘నాని అన్న బేనర్‌లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని కోరారు. ‘నాని నమ్మకాన్ని వమ్ము చేయను. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’ అని రామ్‌ జగదీశ్‌ అన్నారు. దర్శకుడు మంచి స్ర్కిప్ట్‌తో అద్భుతమైన సినిమా తీశాడు అని దీప్తి గంటా తెలిపారు.

Updated Date - Feb 22 , 2025 | 09:10 AM