విభిన్నంగా ఉండాలని చేసిన ప్రయత్నమే హిట్‌ 3

ABN, Publish Date - May 01 , 2025 | 06:05 AM

‘అన్ని సినిమాలూ బాగా ఆడితేనే మన సినిమా కూడా బాగా ఆడుతుంది. అందుకే పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని సినిమాలూ బాగా ఆడాలి అని కోరుకోవాలి...

‘అన్ని సినిమాలూ బాగా ఆడితేనే మన సినిమా కూడా బాగా ఆడుతుంది. అందుకే పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని సినిమాలూ బాగా ఆడాలి అని కోరుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది’ అని హీరో నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్‌ 3’. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా నాని మీడియాతో ముచ్చటించారు.

  • నా గత చిత్రాలకూ ఈ సినిమాకు స్పష్టమైన తేడా ఉంది. ఈ సినిమా కథ పూర్తిగా వేరు. మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ‘జెర్సీ, దసరా, హాయ్‌ నాన్నా’ ఇలా నా ప్రతి సినిమా ఓ కొత్త జానర్‌లో ఉండాలని ప్రయత్నించాను. ఆ కోవలోనే విభిన్నంగా ఉండాలని చేసిన మరో ప్రయత్నమే ‘హిట్‌ 3’. ఇందులో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఇదొక డిఫరెంట్‌ జానర్‌ సినిమా. టార్గెట్‌ ఆడియన్స్‌ని మెప్పిస్తే చాలు మా సినిమా కచ్చితంగా బ్లాక్‌


బస్టర్‌ అవుతుంది.

ఫ గతంలో ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌. ‘హిట్‌ 3’లో కథానుసారం యాక్షన్‌తో పాటు హింస కూడా చేరింది. అలాగని హింసను గొప్పగా చూపించేందుకు ఈ సినిమా తీయలేదు. కథకు అలా కుదిరింది. ‘సలార్‌’ తరహాలో తెరపైన చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది.

  • శైలేష్‌ ఎక్కువగా యాక్షన్‌ సినిమాలు చేస్తున్నాడు కానీ అతని మాటల్లోనే జోకులు పేలుతుంటాయి. ఓ మంచి కామెడీ స్ర్కిప్ట్‌ రాయమని చెప్పాను. మిక్కీ జే మేయర్‌ ఇప్పటివరకూ ఫీల్‌ గుడ్‌ మూవీ్‌సకు మాత్రమే పనిచేశాడు. థ్రిల్లర్స్‌కు పనిచేయలేదు. ఆయన ఒక వేళ థ్రిల్లర్‌ చేస్తే ఆ సౌండింగ్‌ కొత్తగా ఉంటుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. శ్రీనిధి అద్భుతంగా నటించారు. ఆమె నటన ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ.

Updated Date - May 01 , 2025 | 06:05 AM