నిర్మాతగా ఈ సక్సెస్ నాకు ప్రత్యేకం
ABN , Publish Date - May 02 , 2025 | 02:00 AM
‘నేనూ ప్రేక్షకుల్లో ఒకణ్ణే అని నమ్మిన ప్రతిసారీ మీరు మంచి విజయాలను అందించారు. ‘హిట్ 3’ అద్భుత విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా...
‘నేనూ ప్రేక్షకుల్లో ఒకణ్ణే అని నమ్మిన ప్రతిసారీ మీరు మంచి విజయాలను అందించారు. ‘హిట్ 3’ అద్భుత విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఇది తెలుగు సినిమా విజయం. ఒక నిర్మాతగా కూడా ఈ సక్సెస్ నాకు చాలా ప్రత్యేకం. ఈ విజయం శైలేష్ విజన్‌కి టీజర్, ట్రైలర్ లాంటిది మాత్రమే. అతను మున్ముందు మరిన్ని గొప్ప సినిమాలు చేయగలడు’ అని నాని అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హిట్ 3’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్‌తో కొనసాగుతున్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ ‘‘హిట్ 3’, సినిమాకు వచ్చిన స్పందన చాలా ఆనందాన్నిచ్చింది. నాని గారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. యూనిట్ కష్టం వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘సూపర్ హిట్ లేకుండానే వేసవి సీజన్ ముగుస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడు ‘హిట్ 3’ విజయంతో తెలుగు సినీ పరిశ్రమ మళ్లీ ఊపిరి తీసుకుంది’ అని చెప్పారు.