సర్కార్స్‌ లాఠీ

ABN , Publish Date - Feb 25 , 2025 | 05:42 AM

‘హిట్‌’ సిరీ్‌సలో మూడో భాగంగా రాబోతున్న ‘హిట్‌.. ద థర్డ్‌ కేస్‌’ చిత్రం టీజర్‌ను హీరో నాని పుట్టినరోజు సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ‘సర్కార్స్‌ లాఠీ’ పేరుతో వస్తున్న ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది....

‘హిట్‌’ సిరీ్‌సలో మూడో భాగంగా రాబోతున్న ‘హిట్‌.. ద థర్డ్‌ కేస్‌’ చిత్రం టీజర్‌ను హీరో నాని పుట్టినరోజు సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ‘సర్కార్స్‌ లాఠీ’ పేరుతో వస్తున్న ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది. అర్జున్‌ సర్కార్‌గా నాని పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌తో కట్టి పడేశారు. ఆయన నటన సినిమాకు మరింత డెప్త్‌ యాడ్‌ చేసింది. దర్శకుడు శైలేష్‌ కొలను అద్భుతమైన కథనం, విజువల్స్‌తో ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మే ఒకటిన విడుదల కానుంది. సాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రఫీని, మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2025 | 05:44 AM