జైలర్‌ 2 విలన్‌గా నాగార్జున

ABN , Publish Date - May 28 , 2025 | 04:30 AM

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘జైలర్‌ 2’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంతో జరుగుతోంది. ‘జైలర్‌’ సినిమాతో రజనీకాంత్‌ అభిమానులనే కాకుండా తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని...

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘జైలర్‌ 2’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంతో జరుగుతోంది. ‘జైలర్‌’ సినిమాతో రజనీకాంత్‌ అభిమానులనే కాకుండా తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకొన్న దర్శకుడు నెల్సన్‌ దిలీ్‌పకుమార్‌ దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్‌ 2’ పై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకొని మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. రజనీకాంత్‌ ఇందులో వపర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేస్తుండగా, ఈ సినిమాలో ఆయనతో తలపడే విలన్‌గా నాగార్జున నటించనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘కూలీ’ చిత్రంలో వీరిద్దరూ పోటాపోటీగా ఉండే పాత్రలను పోషిస్తున్నారు. ‘జైలర్‌ 2’ లో విలన్‌ పాత్ర కోసం కొన్ని పేర్లు పరిశీలించినా, చివరకు ‘కూలీ’ చిత్రంలో సైమన్‌గా నాగార్జున లుక్‌, పెర్ఫార్మెన్స్‌ చూసి ముగ్ధుడైన దర్శకుడు నెల్సన్‌ తన సినిమాకు ఆయనే విలన్‌ అని ఫిక్స్‌ అయ్యారట. వెంటనే నాగార్జునను కలిశారట. కథ, తన పాత్ర నచ్చడంతో నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని తెలుస్తోంది. ‘జైలర్‌ 2’ చిత్రానికి సంబంధించి ఇప్పటికి రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది.


ఇందులోనే రజనీకాంత్‌, నాగార్జున పాల్గొనే భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించాలని దర్శకుడు నెల్సన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ‘జైలర్‌ 2’లో బాలకృష్ణ కూడా నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఇంతవరకూ ఒక్క సినిమాలో కూడా కలసి నటించని బాలకృష్ణ, నాగార్జున ఈ సినిమాలో కలసి ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తారా, లేక వారిద్దరికీ విడివిడిగా సన్నివేశాలు ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.


Updated Date - May 28 , 2025 | 04:30 AM