Naga Chaitanya: ఆ సినిమా కోసం మూడు టైటిల్స్
ABN , Publish Date - May 17 , 2025 | 01:15 AM
నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ట్రెజర్ హంట్, మైథాలజికల్ థీమ్ కలిగిన ఈ చిత్రానికి 'వృక్షకర్మ' సహా మూడు టైటిల్స్ పరిశీలిస్తున్నారు.
‘తండేల్’ చిత్రం తర్వాత నాగచైతన్య ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియో దిగువన రూ. 5 కోట్లతో ఓ భారీ సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్‌లోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ట్రజర్ హంట్, మైథాలాజికల్ అంశాలున్న ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. వాటిల్లో ‘వృక్షకర్మ’ ఒకటని, మరో రెండు టైటిల్స్ కూడా ఉన్నాయనీ, ఆయన చెప్పారు. నాగచైతన్య లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్. సుకుమార్ రైటింగ్స్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి.