scorecardresearch

Naa Love story: అజయ్ భూపతి చేతుల మీదుగా 'నా లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ 

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:25 PM

'నా లవ్ స్టోరీ' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను 'ఆర్ఎక్స్ 100' (RX100) దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ చిత్రానికి వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు.  మోహిత్ పెద్దాడ కథానాయకుడు.

Naa Love story: అజయ్ భూపతి చేతుల మీదుగా 'నా లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ 



మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ల పై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న 'నా లవ్ స్టోరీ' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను 'ఆర్ఎక్స్ 100' (RX100) దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupati) లాంచ్ చేశారు. ఈ చిత్రానికి వినయ్ గోను (Vinay gonu) దర్శకత్వం వహిస్తున్నారు.  మోహిత్ పెద్దాడ కథానాయకుడు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం అజయ్ భూపతి మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు "వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేశాం. ఈ వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ చాలా యూనిక్ గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కొత్త తరహా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
దర్శకుడు వినయ్ గోను ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను" అని  దర్శక నిర్మాతలకు, చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలియచేసారు. 



సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.."ఏం మాయ చేసావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్న నాకు డైరెక్టర్ వినయ్ గారి అలాంటి అవకాశం దక్కింది ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తానని... మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయన్న నమ్మకం ఉందని అన్నారు

 

Updated Date - Feb 14 , 2025 | 05:26 PM