థియేటర్లలో చూడాల్సిన చిత్రం
ABN , Publish Date - May 26 , 2025 | 04:37 AM
అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి తీసిన చిత్రం ‘ఘటికాచలం’. నిఖిల్ దేవాదుల హీరోగా అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు.
అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి తీసిన చిత్రం ‘ఘటికాచలం’. నిఖిల్ దేవాదుల హీరోగా అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు. ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై ఎంసీ రాజు నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శుక్రవారం ఎస్‌కేఎన్ చేతుల మీదుగా యూనిట్ ట్రైలర్‌ను ఆవిష్కరించింది. థ్రిల్లింగ్ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది, థియేటర్లలోనే చూడండి అని ఎస్‌కేఎన్ కోరారు.