Film Announcement : ‘నేను చెప్పే వరకు ఆట పూర్తవదు’
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:23 AM
శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పరిశోధనాత్మక ఉత్కంఠభరిత చిత్రం ‘మృత్యుంజయ్’. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్...
శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పరిశోధనాత్మక ఉత్కంఠభరిత చిత్రం ‘మృత్యుంజయ్’. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. రెబా జాన్ హీరోయిన్. ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న చిత్రమిది. శుక్రవారం శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ చివర్లో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. కాగా, శ్రీవిష్ణు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.3గా సుమంత్ నాయుడు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.