సినిమాలకు లాజిక్‌తో పని లేదు
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:13 AM
కొన్ని సినిమాలకు లాజిక్‌తో పని లేదని, దర్శకుడు ప్రేక్షకులను నమ్మించగలిగితే ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అన్నారు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...
కొన్ని సినిమాలకు లాజిక్‌తో పని లేదని, దర్శకుడు ప్రేక్షకులను నమ్మించగలిగితే ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అన్నారు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా నచ్చితే లాజిక్‌ను ఎవరూ పట్టించుకోరని, టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తీసేసినిమాల్లో లాజిక్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారా? లేదు కదా అని ప్రశ్నించారు. రాజమౌళికి కథపై పూర్తి పట్టు ఉంటుందని, ఆయన ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కిస్తారని వివరించారు. యానిమల్, ఆర్‌ఆర్‌ఆర్, గదర్... ఈ సినిమాలన్నీ ఇదే ఫార్ములాపై విజయవంతమయ్యాయని కరణ్ జోహార్ చెప్పారు. కాగా, కరణ్ జోహార్ ప్రస్తుతం ‘సన్ని సంస్కారి కీ తులసి కుమారి’ సినిమా నిర్మిస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్య మల్హోత్రా, రోహిత్ శరఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే
రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో
ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి