కన్నప్ప నుంచి కిరాత లుక్‌

ABN , Publish Date - May 22 , 2025 | 06:00 AM

మలయాళంలో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ సాధిస్తూ యువ హీరోలతో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతున్నారు మోహన్‌ లాల్‌. మంచి విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రంలో...

మలయాళంలో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ సాధిస్తూ యువ హీరోలతో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతున్నారు మోహన్‌ లాల్‌. మంచి విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రంలో ఆయన కిరాత పాత్రతో అలరించపోతున్నారు. బుధవారం మోహన్‌లాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రంలోని ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. దైవిక శక్తితో ముడిపడున్న కిరాత పాత్రను ఇందులో మోహన్‌లాల్‌ పోషించారు. మోహన్‌లాల్‌ అభిమానులనే కాకుండా ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఈ పాత్రను తీర్చిదిద్దారు. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా ‘కన్నప్ప’ విడుదల కానుంది. ప్రస్తుతం మంచు విష్ణు ఈ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.


మోహన్‌లాల్‌ జీవిత చరిత్ర ‘ముఖరాగం’

బుధవారం 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మోహన్‌లాల్‌ ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ‘ముఖరాగం’ పేరుతో తన జీవిత కథ పుస్తకరూపంలో రానున్నదని ఆయన వెల్లడించారు. తన 47 ఏళ్ల నట జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, విశేషాలు ఈ పుస్తకంలో ఉంటాయనీ, భానుప్రకాశ్‌ అనే రచయిత వీటికి అక్షర రూపం ఇచ్చారనీ మోహన్‌లాల్‌ చెప్పారు. దాదాపు వెయ్యి పేజీలు కలిగిన ఈ పుస్తకం డిసెంబర్‌ 25న విడుదలవుతుందని ఆయన తెలిపారు.

Updated Date - May 22 , 2025 | 06:00 AM