Mohanlal : రీ రికార్డింగ్‌లో ‘1000 కోట్లు’

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:35 AM

మోహన్‌లాల్‌ హీరోగా జోషి దర్శకత్వంలో కాసుల రామకృష్ణ, శ్రీకర గుప్త నిర్మించిన చిత్రం ‘1000 కోట్లు’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల

మోహన్‌లాల్‌ హీరోగా జోషి దర్శకత్వంలో కాసుల రామకృష్ణ, శ్రీకర గుప్త నిర్మించిన చిత్రం ‘1000 కోట్లు’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ ‘మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన చిత్రాన్ని తెలుగులో ‘1000 కోట్లు’ పేరుతో విడుదల చేస్తున్నాం. మోహన్‌ లాల్‌ సరసన కావ్య మాధవన్‌ నటించారు. ప్రముఖ సీనియర్‌ ఆర్టిస్ట్‌ నాగ మహేశ్‌ మోహన్‌లాల్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని జనవరి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని అన్నారు. పీఆర్‌ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Updated Date - Jan 04 , 2025 | 05:35 AM