ముస్సోరిలో మెగాస్టార్‌

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:12 AM

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘మెగా 157’ వర్కింగ్‌ టైటిల్‌. ఇటీవలె హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను...

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘మెగా 157’ వర్కింగ్‌ టైటిల్‌. ఇటీవలె హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్‌. ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ను బుధవారం ముస్సోరిలో ప్రారంభించారు. ఈ అందమైన హిల్‌ స్టేషన్‌లో 10 రోజుల పాటూ వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. చిరుతో పాటూ సినిమాలోని కీలక పాత్రధారులు ఇందులో పాల్గొంటున్నారు. ఆయనకు జోడిగా నయనతార నటిస్తున్నారు. ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’, ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రాల తర్వాత వారిద్దరూ కలసి నటించడం ఇది మూడోసారి. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి వినోదానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తుండడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో ఆయన పాత్ర అభిమానులకు విజువల్‌ ట్రీట్‌లా ఉంటుందని మేకర్స్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Jun 12 , 2025 | 06:12 AM