మళ్ళీ వస్తున్న మాయాబజార్
ABN , Publish Date - May 21 , 2025 | 01:29 AM
తెలుగువారు ఇష్టపడే క్లాసిక్ చిత్రాల వరుసలో ‘మాయాబజార్’ ముందు స్థానంలో ఉంటుంది. తరాలు గడుస్తున్నా ఈ సినిమాపై వారికి ఉన్న ఆదరాభిమానాలు ఏ మాత్రం తగ్గలేదు సరికదా రోజురోజుకూ...
తెలుగువారు ఇష్టపడే క్లాసిక్ చిత్రాల వరుసలో ‘మాయాబజార్’ ముందు స్థానంలో ఉంటుంది. తరాలు గడుస్తున్నా ఈ సినిమాపై వారికి ఉన్న ఆదరాభిమానాలు ఏ మాత్రం తగ్గలేదు సరికదా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల రీరిలీజ్‌ల ట్రెండ్ ఊపందుకున్న తరుణంలో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా కలర్ వెర్షన్‌లో బలుసు రామారావు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్థన్ మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాది ప్రత్యేక స్థానం. ఇప్పటితరానికి ఈ సినిమా ఓ మైలురాయిలాంటిది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రమేశ్ ప్రసాద్, దర్శకులు ఎస్‌వీకృష్ణారెడ్డి, వీరశంకర్, త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు.