ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:16 AM
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలె తన తల్లి మాధవితో కలసి మహాకుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేసిన ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు...
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలె తన తల్లి మాధవితో కలసి మహాకుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేసిన ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు. అనంతరం కాశీనాథుని ఆలయాన్ని కూడా వీరు సందర్శించారు. తాజాగా మహాకుంభమేళాకు చెందిన మరికొన్ని ఫొటోలను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టారు. ఈ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందించిదని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండతో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, మరి కొందరు స్నేహితులు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే
రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో
ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి