Vrischikam Movie Launch: అందర్నీ ఆకట్టుకుంటుంది

ABN , Publish Date - May 10 , 2025 | 06:37 AM

మంగపుత్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వృశ్చికం’ లాంచ్‌ అయ్యింది. పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించగా, యశ్విక కథానాయికగా నటిస్తోంది.

మంగపుత్ర కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వృశ్చికం’. శివరామ్‌ నిర్మిస్తున్నారు. యశ్విక కథానాయిక. గురువారం ఈ సినిమాను ప్రారంభించారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. నటుడు కోసూరి సుబ్రమణ్యం కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, సుప్రీంకోర్టు అడ్వకేట్‌ హబీబ్‌ సుల్తానా క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు మంగపుత్ర మాట్లాడుతూ ‘‘మంచి నిర్మాణ విలువలతో, ఉన్నతమైన సాంకేతికతతో తెరకెక్కుతోందీ చిత్రం. అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 06:37 AM