పోలీస్‌గా మంచు మనోజ్‌

ABN , Publish Date - May 21 , 2025 | 01:35 AM

మంచు మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. పరిశోఽధనాత్మక ఉత్కంఠభరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి...

మంచు మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. పరిశోఽధనాత్మక ఉత్కంఠభరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్‌’ అనే శక్తిమంతమైన పేరు పెట్టారు. శ్రీనిధి క్రియేషన్స్‌ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్‌ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మనోజ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్‌ విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ ఆసక్తిని కలిగించింది. మనోజ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. పోస్టర్‌పై ‘దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు’ అనే ట్యాగ్‌లైన్‌ కథలోని మిస్టరీని సూచిస్తోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో చాలా బిజీగా ఉన్న మంచు మనోజ్‌ ప్రస్తుతం ‘భైరవం’, ‘మిరాయ్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ‘రక్షక్‌’ చిత్రంతో మళ్లీ హీరోగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Updated Date - May 21 , 2025 | 01:35 AM