మలయాళ దర్శకుడు షాజీ.. ఇక లేరు

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:06 AM

ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ షాజీ.ఎన్‌.కరుణ్‌ (73) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, సోమవారం తిరువనంతపురంలో కన్నుమూశారు. 1976లో ‘లక్ష్మీ విజయం’తో సినిమాటోగ్రాఫర్‌గా...

ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ షాజీ.ఎన్‌.కరుణ్‌ (73) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, సోమవారం తిరువనంతపురంలో కన్నుమూశారు. 1976లో ‘లక్ష్మీ విజయం’తో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. కొన్నేళ్లపాటూ పలువురు ప్రముఖ దర్శకులతో పని చేశారు. ఆ తర్వాత 1988లో విడుదలైన ‘పిరవి’ సినిమాతో మెగాఫోన్‌ చేతపట్టారు. ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆ చిత్రం, ఏకంగా 31 అవార్డులను కైవసం చేసుకుంది. జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అవార్డులతో పాటు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రశంసను దక్కించుకుంది. ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ‘స్వహమ్‌’ (1994) కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రధమ విభాగంలో పోటీపడింది. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా ఆయన రూపొందించిన మూడో చిత్రం ‘వనప్రస్థానం’ (1999) సైతం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శితమవ్వడం విశేషం.

Updated Date - Apr 29 , 2025 | 04:06 AM