నేడే షూటింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:34 AM

మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వర్కింగ్‌ టైటిల్‌ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’. దుర్గాఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు..

మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వర్కింగ్‌ టైటిల్‌ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’. దుర్గాఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని సినీ అభిమానులంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడేలా ఉంది. నేడే ఈ సినిమాను హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాగా, ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు టాక్‌. దాదాపు రూ.వెయ్యి కోట్లతో రెండు భాగాలుగా తెరకెక్కించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. మొదటి భాగాన్ని 2027లో.. రెండవ భాగాన్ని 2029లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Updated Date - Jan 02 , 2025 | 06:34 AM