మహాభారత నేపథ్యంలో
ABN , Publish Date - May 11 , 2025 | 03:36 AM
సంగీత సంచలనం రవి బస్రూర్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస్’. శివరాజ్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. నిర్మాత ఎంవీ రాధాకృష్ణ...
సంగీత సంచలనం రవి బస్రూర్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస్’. శివరాజ్‌కుమార్ కీలకపాత్ర పోషించారు. నిర్మాత ఎంవీ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. శుక్రవారం హీరో విష్వక్‌సేన్ ‘వీర చంద్రహాస్’ ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. మహాభారతం నేపథ్యంలో అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిదని రవిబస్రూర్ తెలిపారు.