ఆద్యంతం వినోదం
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:58 AM
విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మదగజరాజ’. సుందర్ సి. దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించింది. జనవరి 31న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. శనివారం వెంకటేశ్ ఈ ...

విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మదగజరాజ’. సుందర్ సి. దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించింది. జనవరి 31న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. శనివారం వెంకటేశ్ ఈ చిత్రం ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. విశాల్, సంతానం పండించిన వినోదం, కథానాయికలు అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ గ్లామర్, విలన్ పాత్రధారి సోనూసూద్‌తో హీరో పోరాటల నేపథ్యంలో సాగిన ట్రైలర్ ఆద్యంతం అలరించింది. ‘మదగజరాజ’ చిత్రాన్ని సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. విజయ్ ఆంటోని సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్.